కాశీవాసము

కైలాసమున నుండి కదలివచ్చెనుతల్లి
కరుణాతరంగిణి కల్పవల్లి
తండ్రెమో తానంత తపములో మునగినా
తల్లెమో తపియించె తనయులనుచు
అవిముక్త నగరాన యవతరించెనుతల్లి
అన్నపూర్ణమ్మగాయాదరించ
విశ్వనాథుడయిన వినయాన యర్థించు
అన్నపూర్ణనుతాను నన్నమనుచు
ఆ.వె.పరమశివుడు తండ్రి భక్తజనులకెల్ల
అన్న పూర్ణ మాత యమ్మ కాగా
భక్త సంఘమంత బంధుబలగమనుచు
నమ్మమనుచు పలికె నాగరాజ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత