నేను -నావిద్యార్థులు
నా స్కూలు పిల్లలందరూ నా
పిల్లలే. వారంతా తెలుగు మాధ్యమంలో నే చదివారు ,చదువుతున్నారు.వారందరూ చక్కగా తెలుగు మాధ్యమంలోనే చదువుకొని ఉన్నతోద్యోగాలలో ఉన్నారు.డాక్టర్లుగా యింజనీర్లుగా లెక్చరర్స్ గా సాప్ట్ వేర్ వుద్యొగాల్లో దేశవిదేశాల్లో వున్నారు.1982 నుంచి నేటివరకు వారందరూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. మీడియం ప్రధానం కాదు ,అది నేర్పే ఉపాధ్యాయులపై ఆధారపడివుంది.పరభాష పరిచయం కలిగినంత మాత్రాన పండితులైపోతారనడం కేవలం అపోహ.ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు రెంటికీ చెడిన రేవడులైనవారు ఎందరో ఉన్నారు." ధోభికా కుత్త నఘర్ కా, నాఘట్ కా" అనే సామేత వుండనే వుంది.కాబట్టి ఆంగ్లమాధ్యమంలో చదివిన విద్యార్థులకన్న తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్లో గౌరవం, పెద్దలపై భక్తి, పరోపకార పరాయణతా వంటి సుగుణాలు ఎన్నో ఉపాధ్యాయుడుగా గమనించాను.ఆంగ్లమాధ్యమనే భేషజం తో ప్రవర్తించే వారినెందరినో చూచాను.ఒక సారి శ్రీపానుగంటి లక్ష్మీ నరసింహా రావు చే రచింపబడిన సాక్షి వ్యాస సంపుటిలోని "స్వభాష" వ్యాసం చదివిన కొంత వరకు ఆంగ్లమాధ్యమపు తెరలు తొలగ గురువు.
నావిద్యాభ్యాసం సాధారణ తెలుగు మీడియంలో నే జరిగింది. అప్పటి విద్యావిధానంలో హయ్యర్ సెకండరీ సిలబస్ ప్రకారం కేవలం భౌతిక రసాయనిక గణిత శాస్త్రములు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లంలోబోధించే వారు.(1969)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి