ఉచితజ్గత
ఉచితజ్ఞ తేలేని వున్మత్తుడతడేను
మతపు వెఱ్ఱిదనము మైక మాయె
వేదికేదైనను యెలుగెత్తి పలుకును
కాశ్మీర మనుచును కారులరుచు
పరులసొత్తుకొరకు పౌరాటమేకాని
తనదేశ మన్నదే తలవ డతడు
మతముపిచ్చిముదిరె మర్దన చేయగా
అవసరంబు గలిగె నాత్ర పడుడు
ఆ వే.హితము వినక యున్న యిక్కట్లు మిగిలేను
తోడు లేదు వేరు త్రోవ లేదు
ఉగ్రభూత మనుచు నూహలే మానుము
కాశ్మిరమచు నీవు కలలు కనకు
[ఇమ్రాను ఖానుడా హితము వినుమా】
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి