తండ్రిమాట
తండ్రిమాటకొరకు తనయుడు భక్తితో
వనవాసమేగిన వసుధ నాది
తనయవ్వనంబంత తండ్రికర్పించిన
పూరుండు పుట్టిన పుడమినాది
తండ్రిమారుమనువు తనయుడు చేయుంచు
భీష్ముండు పుట్టిన పృథివి నాది
తల్లిదాస్యంబును తనయుండు బాపిన
వైనతేయునికన్న వసుధ నాది
ఆ.వే.మాన్యులైన నరులు మనునట్టి దేశమ్ము
భరత వర్ష మొకటె ధరణి పైన
ఎన్ని జన్మ లైన యీదేశమందునే
పుట్టదలచి నట్టి పూని కిదియె
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి