యథార్థ వాది

బల్లగుద్దినటల పల్కుటే నాకొచ్చు
ఇచ్చ"కంపు"పలుకు యింపుగాదు
పటికబెల్లమటుల పలుకలేనెప్పుడు
మోమాట మెరుగని మొండితనము
మనసులో యికిలింపు మాటలో సకిలింపు
నేర్వలేనైతిని నేర్పు మెరసి
కోపిష్టి వాడంచు కొండెముల్ చెప్పనీ
మనసులో గలదయ్య మార్దవంబు
ఆ.వే. పలుకు తీపి కోరకు పలుగాకి పలుకులు
పలుక లేను నేను  బాష్కళాన
అనుచు పలుకునెపుడు నసహాయ శూరుండు
జనులకేమొ వాడు.జవము నొసగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత