కావు మయ్యమమ్ము

కావుకావుమనుచు కరుణాంత రంగుని
కాపట్యమేలేక కాకి పిలుచు
రామరామయనుచు రాజిల్క భక్తితో.రామచంద్రుని వేడు రక్తితోడ
కౌతూహలంబుతో కోకిలంబంతట
కుహురవముతోడ కృష్ణు పిలిచు
చిన్నారి శ్రీకృష్ణు సిగలోన శిఖిమౌళి
నేనంచు పల్కెను నెమలియంత
ఆ.వే.గరుడ గమున డతడు ఖగరాజు లేకుండ 
గడప డాతడంచు కథను వినమె
పక్షిలోక మెంత భాగ్యంబు చేసెనో
మనకు లేక పోయె మంచి బుధ్ధి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత