జగద్గురువు
జగతికంతగురువు జననిచాటునదాగు
మనుజబాలుడటల మసలుచుండు
అవనిభారంబును నంతంబుచేయగా
ఇలకుదిగినయట్టి యీశ్వరుండు
తల్లిచాటుతనము తలపించురీతిగా
మాయతోడమెలగు మాయకాడు
అందినటులదోచు నందకుండతిరుగు
అమ్మదొంగదొరికె యనగనిచ్చు
వెన్నదొంగయనుచువెదికినా దొరికాడు
మనసుదోచుకొనిన మంచిదొంగ
దేవకీ గర్భాన దేవకార్యార్థమై
అవతరించిన యట్టి యచ్యుతుండు
గోవర్ధనోధ్ధారి గోపాలబాలుడై
విహరించ వచ్చిన విష్ణు వతుడు
గారాబు తనయుడు మారాము చేయగా
తల్లిమనసుకాదె తన్మయంబు
ఆ.వె.ముగ్ధబాలుడట్లు మురిపాలు చూపచూ
(తల్లి వెన్క నక్కె పిల్లి యిట్లు)
అమ్మ వెన్క నక్కె యర్భకుండు
ఇతని చరణ సేవ యెన్నిజన్మలయైన
చేయుచుందునోయి చిత్త మందు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి