సీసపద్యము
"రా"జీవనేత్రుడే "మా"జీవమంత్రమ్ము
రామతారకమౌను రామ రక్ష
పరమేశు తత్త్వంబు పరమాత్ము విభవమ్ము
వాగర్థములరీతి వాస్త వమ్ము
మాహేశు నామంబు మాధవు రూపంబు
మదిలోని మెరువగా మంగళమ్ము
భుజగశయనుకొల్చి భుజగభూషణు మ్రొక్కి
అతిశయానందమ్ము నందుకొందు
ఆ.వె.ఎన్నిజన్మ లేగె యీజన్మలభియించె
ఆదుకొందువనుచు నాశకలదు
దారిచూపు వాడు దామోదరుండంచు
మదిని నమ్మినాను మరువకెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి