పాపిష్టి దేశమ్ము

పావన నామంపు పాపిష్టి దేశమ్ము
పొరుగునె వున్నట్టి  పొగరుబోతు
కాశ్మీర రాష్ట్రాన్ని కబళించు దృష్టితో
గాలిలో మేడలు కట్టు నాకంటే!
మతమౌఢ్య భూతంపు మైకమ్ము క్రమముగా
కుట్రలల్లుచు నుండు కుటిల వాజి
ఉఛ్ఛ్వాస మాయగా నుగ్రవాదంబంత
నిస్వాంత మాయెను నీచ బుధ్ధి
భస్మాసు రుండిట్లు భూమిపై నున్నట్లు
లోకాని కీరితి లోకు వాయె
ఆ.వె.వక్ర బుధ్ధితోడ వగలమారి పలుకు
క్రియల యందు యెపుడు కీచ కమ్మె
అల్ప సంఖ్యు లెల్ల నాగమైరి యచట
నీతి మాటలు లాడు నీచ బుధ్ధి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత