తక్కువనుకోకు
తక్కువనుచు నీవు తడబాటు పడబోకు
మంచివాడవనచు మరచి పోకు
తెలివిమంతుడనుచు తెలిసికొన్ననుమేలు
అందాననీవంత యపరంజి బొమ్మెను
ఆరుపలకలనుచు నారట పడబోకు
బలశాలి నీవంచు భావ ముంచు
విశ్వాస మెకటేను విజయమందించగా
నమ్మకమునశింప నరకమౌను
ఆవె.ఆటుపోట్లకెపుడు నదరిబెదరవద్దు
నీదు నమ్మకమ్మె నిన్ను కాచు
దైవ మెపుడు కాచు ధైర్యశాలినెపుడు
నాగరాజు మాట నమ్ము మోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి