గంగ

శివుని జడలనుంచి చిందులేయుచుగంగ
పుడమితల్లి నంత పుణికె నదిగొ
జాహ్నుమునిని చేరి జాహ్నవీ దేవియై
పుడమిజనులకెల్ల పుణ్యమొసగె
2
గంగగంగ యనుచు కరగవేపాపాలు
వేలమైళ్ళనుంచి వేడుకొన్న 
స్నాన మాచరించ స్వర్గమ్ము సమకూరు
గంగకెవరుసాటి గంగకన్న

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత