రామయ్య తండ్రి
రామయ్య తండ్రయ్య యమ్మయేసీతమ్మ.
తమ్ముడులక్ష్మయ్య తగవు దీర్చు
హనుమయ్య మాకెంతో నాప్తుడుమాకంత
భరతుశత్రుఘ్నుల ప్రాపుకలదు
కౌసల్య తల్లిలా గమనించు మమ్మెంతో
సౌమిత్రి తల్లిలా సుజను లుండ్రు
ఆసేతు శీతాధ్రి పర్యంత దేశమ్ము
రామయ్య యేలిటి రాజ్యమాయె
ఆ.వే౹ గ్రామ మేమియైన రామాల యములేని
ఊరు చూప లేరు నుర్విలోన
రామ కథ మాకు రక్తగతముకాదె
ఇన్ని మాటలేల యింక మీకు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి