భరత మాత
వందనములు మాత వందనములు తల్లి
వర్ధిల్ల వలెనమ్మ భరతమాత
సుజలాలు మాకిచ్చి సుఫలాలు నందించి
మలయమారుతాలు మాకునొసగి
పాడిపంటలతోడ పచ్చనౌ సీమంత
మాకిచ్చినావమ్మ మమతతోడ
సౌఖ్యమ్ము నందించు సౌజన్య మూర్తివి
వరదాయి నీవమ్మ వరములివ్వ
ఆ.వే.భాగ్య మొసగు నట్టి భరతాంబ యెడిలోన
పూర్వ పుణ్య గరిమ పుట్టినాము
తల్లిరుణము తీర్ప తరణమిదియేను
మాకు శక్తి నొసగు మమత తోడ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి