చీకటిల్లు
చీకటనుచు నీవు చిర్రెత్తి పోకుండా
దివ్యమౌ దీపాల దీప్తు లెగయ
వెలిగించ వలనోయి వెలుగంత చిమ్మగా
అజ్ఞాన తిమిరాన్ని యంతమ్ము చేయగా
జ్యోతిస్సు నీకిచ్చు స్పూర్తి యెంతొ
ముక్తకంఠమ్ముతో మున్ముందు మీరంతా
జయజయ ధ్వానాలు జగతి నిండా
రోగమ్ము తరిమేయి రోజు యిదియె
కఠినకరోనాను కట్టడి చేయగ
సంకల్ప సిధ్ధితో సాగ వలయు
ఆ.వె.తిమర సమర మందు దివ్యమౌ దీపంబు
స్వాస్థ్య సిధ్ధి కొరకు సాహసంబు
వసుధ లోన మనకు వజ్రాయు ధమ్ముగా
అందు కొనగ రండి యందరిపుడె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి