పరిశుధ్ధత
పరిశుద్దునిప్పుడెపరిశుధ్ధ పరుచుటె
పుణ్యకార్యమవును పుడమిలోన
జనులశుధ్ధపరిచి జాడ్యంబు పాలౌట
సహజసిధ్ధమగుట సంభవమ్మె
గోపంచితంబంత గోరంత చల్లినా
శుద్ధ బుద్ధులగుట సూనృతంబు
సాధుభాషాణచే సాధ్యంబుకాకున్న
ఆవుపంచితమంత యస్త్రమౌను
ఆ.వె.ఇట్టి నీతిశాలి యిహలోకవిజయుండు
కన్నతల్లికడుపు కనకసమము
ధక్షుడతడువాడె ధర్మైక దీక్షతో
ముందుకేగుచుండ ముదము మాకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి