కుకవి నింద

1ఉన్నమాట పలుకు నులుకేల కవివర్య
నిజము పల్కితంచు నింద యేల
పెద్దలన్న మాట సద్దిమూటయనుచు
నీవు తెలుప వేల నిక్కుదగునె
2చొప్పదంటుకవిత నోప్పరుజనులెల్ల
పొదుపు పోహళింపు పద్యమగునె
భావమొసగు కవిత పరిమళించుజగతి
కావ్యమర్మమెరగు కవిత నిమ్ము
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత