మాతృగర్భము
తనవితీరదసలు తాపసులకైనను
కాంక్షతీరదసలు కనులకెపుడు
కనురెప్పలిచ్చినకమలభవునితోడ
కయ్యమే మేలౌను ఖచ్చితమ్ము
నిరుపద్రవముగానీరజాక్షనిచూడ
కనురెప్ప టపటపా కదిలి జేసె
కనకన రుచిరమౌ కమలాక్షు నేత్రాల
చూచిన చూడ్కులే సురిచిరమ్ము
ఆ.వే.గగన సదృశు రూపు కనులార చూడగా
మాకు నొసగ వయ్య భక్తి మయత
ఇంత కన్న తెరువు యిలలోనలేదంచు
శుకుని పలుకు లెల్ల సూనృతమ్ము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి