ఆదిత్యడా ఆదుకోవయ్య
కశ్యప పుత్రుడా కాపాడు విశ్వాన్ని
తరుణమిదయనుచు తలచినాము
నీదుకిరణములు నిర్జించు రోగాన్ని
స్వాస్థ్య మొసగునట్టిసమయమాయె
ఆరోగ్య మొసగేటి యాదిత్యుస్మరణమే
శ్రీరామరక్షగా చిక్కె మాకు
వందనమ్ములు చేయ వరమిచ్చు వేల్పుగ
వేదాలు తెల్పిన వేల్పు గావె
ఏకచక్ర రథమెక్కి యేలేవు లోకాలు
ఏడగడవనుచు యెంచినాము
ఆ.వె. చిమ్మచీక టంత చీకాకు పరిచేటి
నీదు కిరణ రాశినంత నిపుడుపంపు
మిత్రు డైతి వయ్య హితముగూర్చుమనుచు
కోరు చుంటి మిపుడు సూర్య నిపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి