తిరువనంతపురం ను అనంతపద్మనాభుడు

ధరణిపై ధర్మమ్ము తలయెత్తుకొనినట్లు
గాంభీర్య ముద్రతో కాంచినాము
కుత్సితార్థమతులు కూలినారనువార్త
కర్ణపేయంబుగా గ్రోలినాము
పద్మనాభునితోడ పరిహాస మాడిన
అసలుకే యెసురంచు యర్థ మాయె
దేవస్వములకోరు దేభ్యంపు మరుజన్మ
సారమేయపుగతి సత్యమోయి
ఆ.వె. విశ్వ మయుడు తాను విగ్రహమును నుండి
వీక్ష చేయునట్టి వేదమయుడు
కర్మఫలమునిచ్చు కర్మసాక్షియతడు
నిజము మరచి పోకు నీవు యెప్పుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత