పశ్చాత్తాప భక్తీ

బ్రతుకులోనయెపుడు పరమేశు పూజను
చేయనైతియకట చేతులారా!
మరణమందినపుడు భస్మమైతిననచు
తల్లడిల్లునరుని తండ్రి వోలె
వాత్సల్య మొప్పగా భస్మంపురాశిని
ఆప్యాయమొప్పగా యలమినావు
పితృవన మందున పిలిచినాపలికేటి
దిక్కేమి లేనట్టి దీనుల కెల్లను
నివదిక్కనుటచూడ నిజము కాదె
ఆ.వే.ఆతడె కాడె మనకు నమ్మనాన్నలెపుడు
అతడె మనకు యెప్పుడు నండదండ
అనుచు తలచు చున్న యషుతోషు డెప్పడు
మనవి వినును తాను మరువ డెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత