మానవహక్కులు
మానవ హక్కుల మానవోత్తమలింక
మారుపలుకరేల మహిని మీరు
పౌరహక్కులనుచు పోరాడు వారింక
బిక్కమొ గమువైవ చిక్కు రాదె
భారత దేశాన ప్రబలంబుగామీరు
కంఠశోషంబుగా కాటు లాడి
చైనిదేశమనిన చెప్పరానంతమైత్రి
మానవహక్కులు మరుపుకొచ్చునకట
సామ్యవాదమనెడు సావాసదోసమ్ము
వదలనమన్నను వదలదేల
తప్పులుండవనుచు తగవుపడరు
అమ్నెష్టి పేరుతో నారజకంబంత
పౌరుహక్కులపేర పాత రేయు
ఆ.వే.పరుల దేశమ మందు పౌరహక్కులెపుడు
కలను కూడ మనము కాంచ లేము
ఉగ్రవాద మంత నుసికొల్పి
మతము పేర నిత్య మారణహోమాన్ని
నిష్ట తోడ చేయు దుష్ట బుధ్ధి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి