పర్యావరణ పరిరక్షణ
మంజుల మైనట్టినట్టి మనుజలోకంబు
మరుభూమి గా మార్చెను మానవుండు
భూమియేమాదంచు బూకరించునరుడు
సర్వజీవులనెల్ల సంహరించి
వికటాట్టహాసంబు వికృతమౌరీతిగా
చేయగా జాలిన చెనటి వాడు
కడలినంతనరుడు కాలుష్య భరితమ్ము
కావించి చెడగొట్టు కఠిను డతడు
కాన లన్ని నేడు కాలుష్య భవనాలు
వృక్ష సమితియంతనుసురుతీసె
(తరువు లన్ని నేడు తరుగు లాయె)
సహజ వనురు లన్ని సర్వంబు ధ్వంసమ్ము
నరక లోక మాయె నరుని బ్రతుకు
[రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి]
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి