శ్రీగిరి మల్లన్న
శ్రీగిరి మల్లన చేదుకోవయ్యంచు
నిరతంబు నాకంత నీదు జపమె
పంచాక్షరీమంత్ర పరమార్థ తత్త్వంబు
నిరతంబు జపియింప నిర్ణ యంబె
ఏక్రామ నాథుడై యిలలోన వెలసెగా
కామాక్షి దేవితొ కంచిలోన
జంబుకేశ్వరమున జలలింగమైతాను
అయ్యిఖిలాంబతో నరుగుదెంచె
స్మరణమాత్రముచేత సాన్నిధ్య ముక్తిని
అరుణాచలేశుండునంద జేయు
కాళహస్తీశుండు జ్ఞానప్రసూనలు
ఆశిస్సులందించు యనవరతము
ఆకాశ లింగమై యానంద మూర్తియై
తాండవంబాడుగా తరలె నచట
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి