కంచి కామాక్షి
జగదంబ మాయమ్మ శరణన్న వారిని
కరుణించు గానెంచు కన్న తల్లి
ఇక్షుఖండముబూని యీడేర్చు కామనల్
కల్పవృక్షమునకే కన్న తల్లి
కంచికామాక్షివై కౌవల్య మొసగెటి
ఏక్రామ నాథుని యేలి కీవు
నీదువలనకాదె నిక్కమై కాంచియే
మోక్షపురములందు మొదటిదాయె
ఆ.వే.పృథివి లింగ మున్న హృద్యంపు పురిలోన
భక్తజనుల కొంగు పసిడి
కంచి పురము కన్న కావలసినదేది
మారు జన్మ కిదియె మంచితావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి