వ్యక్తి పూజ
ఆత్మాభి మానమ్ము నడవిలో వదిలేసి
వ్యక్తి పూజనుచేయు వ్యర్థులార
దేశసేవకొరకు దేహంబు నర్పించి
త్యాగమయతతోడ తనిసినట్టి
వారినెల్లమరచి వళ్ళుమరిచినట్టి
నిర్భాగ్యు లైనారు నిందచెంది
నీచుడైననరుని నేతగా మన్నించి
స్తొత్రంబు చేయగా సిగ్గు పడరె
ఆ.వే.దేశ భక్తి కొరుకు దేహంబు.కల్గెను
మాతృ భక్తి తోడ మసలు మింక
నేలతల్లిమనకు నేతయగుటకన్న
భాగ్యమేమి కలదు మనకు నింక
(రచన;--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
(
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి