గోవర్ధనోధ్ధారి
గోవర్ధనోధ్ధారి కాపాడు జగతంత
కృత్యసంహారణకృతకృత్యంత
నీచేత కాకుండ నిపుణులెవరుమాకు
జగతంత నీచేత జాగ్రత్త గానుండు
మకరిచే చిక్కిన మాతంగ మట్లుగా
క్రిమిచేత చిక్కరి కీడు పడిరి
దుర్వాసు కృత్యను దునుమాడి నావయ్య
అంబరీషుని వోలెనాదుకొనుము
ఆ.వె.ఆర్త రక్షణమ్ము నరచేతీ యాటయ్య
నీవు తలచు కొన్న నిమ్మళంబె
ఆత్మ బంధువనుచు నార్తిజనులకెల్ల
మనసులోని మాట మర్మ మిదియె
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి