అంతర్జాలము
అంతరజాలమ్ము నందివచ్చెనుకాదె
కవితలన్నియుదాతు గగన వీధి
కారుమబ్బులదాచ కారిపొవెప్పుడు
నిండుగా నిలుచును నిమ్మళాన
కలకాలముండును కాలమ్ము గడిచినా
ఎన్నేండ్లు యేగినా యేమి భయము
మేనల్లుడీరీతి మేలుకోరిన వాడు
సాహితీ సేవను సాగనివ్వ
సౌకర్యమొనరించె సాకల్య మౌరీతి
ఆ.వే.కాలగతిని బట్టి కవుల రచనలు
కాలగర్భ మందు కలయ కుండు
తెరువు దొరకె ననచు తెలివితోడమనము
సాగవలయు కాదె సాధ నాన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి