దాక్షిణ్య హీనుడు

ధనముకోరునరుడు దాక్షిణ్య హీనుడై
గురువుబంధువులన్న సరకుగొనడు
విషయలంపటుడింక విడుచుసిగ్గుభయము
జంకుగొంకువిడిచిజారుడగును
చదువునభిలషించు ఛాత్రుడెపుడుకూడ
నిద్రససుఖము విడ్చు నిపుణతొప్ప
ఆకటలమటించు నన్నార్తు చెప్పుడు
పక్వంబు రుచియంచు బాధపడడు
ఆ.వే లోక రీతి నిట్లు సాకల్య దృష్టితో
కార్య ధక్షు డెపుడు గణన చేసి
హంస యట్లు తాను యాచరించగలడు
పాలు త్రాగి యంచ నీళ్ళు నొదులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత