ధాక్షారామః
దక్షవాటికలోన త్ర్యక్ష్యుడై వెలిసెగా
స్పాటిక లింగమై సాంబశివుడు
మాణిక్య మకుటయై మమతాను రాగాన
మమ్మేలు తానంత మాతృమూర్తి
కుంభసంభవుడంత కూర్మితో సేవించే
పరమేశు భజియించె భక్తి తోడ
వ్యాసుండు రచియించి వచియించి వినిపించె
భీమఖండమునంత ప్రీతి మెరయ
ఆ.వే.దర్శ నమ్ము చేత ధన్యులచేయగా
ప్రతిన పూని నట్టి పరమశివుని
నిపుణ మతులు మదిని నిష్టతో జపియింఛి
ధన్యులైరి కాదె తప్ప కుండ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి