గంగమ్మ తల్లి
హరి పద పాద్యమై హరుని శిరమునెక్కి
దుం డుకుదనముతో దుమికి దుమికి
ఉరవళ్ళు పరవళ్ళు నుర్వికేలంచును
శిగలోన బంధించె శివుడు తానె
భగిరథు ప్రార్థనన్ మన్నింప గంగంత
వెల్లువై వరదయై వెడలె నచట
జహ్నుజన్నంబును జలములో ముంచేయ
జహ్నుకరుణచేత జాహ్న వైతి
జలధిలోన చేరి సగరపుత్రులనెల్ల
ముక్తినొసగి నట్టి పుణ్య మూర్తి
నిన్ను పొగడ కలడెనీరజభవుడొన
గంగ కెవరు .సాటి గంగ కన్న్త
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి