భధ్రమౌ మార్గమ్ము
పరమేశు భక్తియే భద్రమౌ మార్గమ్ము
విహితమౌ రీతిగా విశ్వసించు
కర్మాను బంధంపు కడగండ్ల కొలిమిలో
మానవ జన్మమ్ముమాడకుండ
రక్షించు నట్టిదౌ రామరక్షశివుడె
పంచాక్షరీ మంత్రం పంచాయుధములుండ
భవభయములెపడో భస్మమగును
కాలకూటవిషమంత కంఠాన దాచిన
ఆవ్యాజ కారుణ్యు డతడుకాడె
ఆ.వే చిత్త ముందు వెలయు చిదానంద మూర్తిని
ధ్యానమందు నిలిపి ధన్య డగుటె
మనుజ జన్మ లోని మాధుర్య మదియంచు
తెలిసికొనిన చాలు తెరువు దొరుకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి