చెంచాలు చిత్తమ్ము
చంచల చిత్తంబు చాంచల్య విత్తంబు
చిటికెలొ మరణంపు చిత్రమిదియె
కాలుడా కఠినుండు కారుణ్యమాలేదు
ధర్మంపు గతియెంతొ త్వరిత మగును
దానంబు ధర్మంబు ధర్మైక వృత్తియే
మానవ దర్మంబు మరువకండి
పురుషార్థ సాధనే పుణ్యంబు సమకూర్చు
మోక్షపథమునకు మంచి త్రోవ
ఇ.వే.మనుజు జన్మమంత మరలమరలరాదు
పూర్వ పుణ్య మబ్బ పుట్టినావు
వ్యయముసేయబోకు వ్యర్థంబు జన్మను
మనుజ జన్మ.నందె మహిమ కలదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి