శూరత్వం
పోరులోగెలువగా శూరుండు కాడోయి
ఇంద్రియ జయముచే వీరుడౌను
పాండిత్య మున్నంత పండితుడెట్లౌను
ధర్మంబు తెలుపగా తగును బిరుదు
వాక్పటుత వలన వాగ్మికాడెవడైన
మంచి పలుకుచేత మాన్యుడౌను
దానగుణముచేత ధార్మికుడౌనెట్లు
గౌరవాదరముల ఘనత పొందు
ఆ.వే.ఆచరించి చూపు నాడ్యుండు తానౌను
ఊకదంపు రీతి నూహలుచితమగునె
పెద్ద లన్న మాట సద్ది మూటెమనకు
నాగరాజు మాట నమ్మవలయు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి