బడిలోనే పాఠాలు

బడిలోన పాఠాలు బడిలోనె చెల్లును
బ్రతుకుతెరువు చూప పనికిరావు
గడుసుదనముచూపు గద్దరి వాడికి
కలసివచ్చునుకాదె కాలమంత
మాయదారితనము మంచితనమ్మట్లు
మసిబూయ గలవారె మంచివారు
ఆకాశ హర్య్మాల యాశల హరివిల్లు
ఇప్పింతు మనువాడె యిష్టుడగును
చదువెంత చదివినా చప్రాసి బ్రతుకాయె
అంగుష్ట మాత్రుండు యవనినేలె
ఆ.వే.నేతిబీర లోన నెయ్యంత యుండునో
లౌకికంబులోన లోక ముండు
ఈన గాచి నక్క కిచ్చినామునునింద
తెచ్చుకొంటి రయ్య తెలివి లేక
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత