దయ్యాలు

1పాడుబడిన కొంప పాలనురుగుచీర
చేతిలోని దివ్వె చీకటిల్లు
పగలురగులునట్టిదిగులుకలుగుపాట
నట్టినడిమిరేయినక్క వూళ
2
గుండెజల్లు మనగ కుదురుదొరకదాయె
పీచమనుచు గుండె పీకులాడ
దయ్యమనుచు జనులు రివ్వున పాత్రగా
ఎంతధీరుడైన నేమిసేయు
3
నిన్ను వీడి ననుచు నిరతంబు భయపెట్టారు
దయ్యమొకటిచాలు వియ్యమంధ
వసుధ లోన కలుగు వార్తలెల్లవదరు
కాలహారణమగును ఖర్చులేక
4
శిలువ చూపినంత చితికిపోవుటలేదు
చిందులేయగలవు చిలిపిగా ను
ప్రభువు భయములేని పాపిష్టి దెయ్యాలు
ఏమి చేయగలడు యేసుకూడ



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత