ప్రాంతీయ భావాలు
ప్రాంతీయ భావాలు ప్రబలంబు గామార
జాతీయ భావమే జబ్బు పడును
భరతాంబ కప్పుడు బాధకలుగునుకాదె
జాగ్రత్త పడరండి జడత వీడి
స్వాతంత్య్ర సమరాన సర్వంబు నర్పించి
బానిసతనముంత బాపినట్టి
దేశభక్తవరుల దివ్యమౌ కలలన్ని
కల్లలు చేసెడు కాలమొచ్చె
ఆ.వే.మాతృదేశభక్తి మమతాను రక్తితో
మసల వలయు మనము మరువ కండి
జనని జన్మభూమి స్వర్గంబు కన్నను
ఘనము కాదె మనకు ఖచ్చితంబు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి