దైవనింద - ధర్మహేళనము

ధర్మనిందవలన తానంత సర్వంబు
కోల్పోయి దాగెగా కొలను లోన
దైవహేళనమిచ్చు దైన్యంబు తప్పక
కురువంశ మెల్లను కూలెనిటుల
మునులదూషణముతోడ ముప్పులో మునిగెగా
కురుసార్వ భౌముడు కుదురుతోడ
ధర్మంబు స్థాపించ ధరణిలో జనియించె
కృష్ణుండు తానంత కృపను చూపి
ఆ.వే.౼అన్ని దినము లన్ని ననుకూలమనుచును
తలచ రాదు జనులు తప్పకుండ
ఎంత గొప్ప యైన యేమొచ్చు చివరికి
తొడలు విరిగు నోయితప్ప కుండ(
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత