మదిలోని భావాలు
మదిలోన మెదిలేటి భావల వెల్లువన్
పద్యరూపంబున పదిలపరుప
మనసుకలిగెనాకు మమకారభావంబు
మరులుకొనినయట్లు పద్యమందు
పద్యంబు హృద్యమై బ్రతుకంత ధన్యమై
పదికాలములపాటు బ్రతికి యుండు
ఆంధ్రభాషయనగ నందమౌ పద్యమ్ము ఇలలోన మనకెల్ల యింపు గూర్చు
ఆ.వే.పద్య రచన చేయ పరమోత్సవంబట్లు
నిత్య రచన చేయ నియతి యాయె
అమ్మ దయను వేడి హర్షంబుతో నేను
రచన చేతు నింక రక్తి మీర
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి