మహనీయమౌ మానవ జన్మ

మహనీయమైనట్టిమానవ జన్మమ్ము
పూర్వ పుణ్య ఫలము పుడమిలోన
విలువైన జన్మమ్ము విప్రుని జన్మమ్ము
వేదాల శాస్త్రాల వేదికట్లు
వైదిక ధర్మము వేదాంత తత్త్వంబు
పడుగుపేకలరీతి ప్రబల వలయు
ధర్మార్థ కామల తత్త్వంబు గ్రహించి
మోక్షమార్గమునందు మోకరిల్లి
ఆ.వె.తన్ను తాను తెలియు తత్త్వార్థ జిజ్ఞాస
మంచి చెడ్డలెరుగు మంచి బుధ్ధి
ఇన్నిగుణములున్న యింగిత తజ్ఞుడిలను
వెదికి వలయు గురువు విసువుపడక
,(రచన,:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత