ధర్భంబు నెలకొల్ప

ధర్మంబు నెలకోల్ప తానొచ్చె శివుడంత
శంకరాచార్యులై శాస్త్రవిధిగ
(కాలడీ గ్రామాన కరుణాంత రంగుడు
కైలాసమున నుండి కదిలివచ్చె)
ఆర్యాంబ శివగురుల్ నర్థింప తానంత
జననమందినాడు జాలితోడ
గర్భాష్టమందున గడియించె తానంత
వేదాది శాస్త్రముల్ వేదవిధిగ
కరుణాంతరంగుడై కనకవర్షంబును
కురియింపజేసెను కూర్మి మీర
పూర్ణాంత రంగుడై పూర్ణానదిని వేడి
మార్గంబు మార్చెను మాతకొరకు
బ్రహ్మ సూత్ర ములకు భగవధ్గీతలకంత
నిగమశిఖల కెల్ల నింపుగూర్చు
భాష్యమంద జేసె.భావితరములకెల్ల
శంభుకథలు మనకు శుభము లొసగు
౼౼౼౼౼౼౼౼🙅🙅🙅🙅🙅౼౼౼౼౼
(రచన:౼విద్వాన్ గొల్లొపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత