కాషాయ వస్త్రాలు - కౌగిలింతలు

కాషాయ వస్త్రాలు కౌగిలింతల జోరు
యతి ధర్మ మంతయు చితికి పోయె
అనురాగ ద్వేషాలునణుమాత్రమేలేని
సన్యాసి ధర్మంబు చచ్చి పోయె
యుక్తంబు కానట్టి రక్తియే  మితిమీరి
ఆశ్రమ ధర్మమ్ము నడవి గలసె
ప్రస్థానభాష్యాల పఠనమ్ము మానేసి
రాజకీయాలతో రంధి పెరెగె
బ్రాహ్మాను సంధాన భవ్యమౌ మార్గమ్ము
అడ్డదారుల బట్టి యాగమాయె
ఆ.వె.కలికి చిక్కె ననచు కన్నీరు కార్చగా
సమయ మెదవె నింక సాక్ష్య మిదియె
వెదుక నేల మనము వెర్రిగా నింకను
కఠిన సత్యమిదియె కాంచవోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత