భక్తసులభుడు
కనకకశిపుసుతు కరుణించికావగా
కరుణార్ధ్ర ధృష్టితో కదిలివచ్చె
కరిరాజు మకరితో కలతచెందెననచు
కరుణతో తానంత కదిలి వచ్చె
కోమలి ద్రౌపది కోకలొసగికావ
కరుణించి తానంత కదిలి వచ్చె
కార్పణ్య దోషంబు కవ్వడికి కల్గ
కర్తవ్య మెరిగింప కదలివచ్చె
భక్తజనుల పాలి.ప్రహ్లాద వరదుండు
ఆర్తజనులకెపుడు నందదండ
మానరక్షసేయు మాధవుండతడోయి
విజయసఖుని లీల వివర మిదియె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
[కవ్వడి,విజయుడు ఇవి అర్జునుని నామములు】
కార్పణ్యదోషము=కృపణత్వము (పిరికితనము)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి