అక్షరము
అక్షరంబవలయునఖిలజనులకెల్ల
చదువువలన యన్ని సాధ్యమగును
అక్షరంబెపప్పుడు నానంద మందించు
చైతన్య మొసగును శక్తినిచ్చు
బ్రతుకుతెరువునిచ్చి ప్రగతిఫథముజూపు
ఆత్మవిశ్వాసమ్ము నధికమగును
నీలోని నిబిడమై నిండుగా యున్పట్టి
అందమౌ భావాలు నంద జేయ
యక్షర జ్ఞానమే యవసరమింకను
ఆ.వే. మరువకండి మీరు మనసుపెట్టవలయు
నేర్వ వలయు విద్య నేర్పుగాను
చదువుతోడ యింక సంస్కార మబ్బిన
పూవుతోడ తావి పుట్టినట్లు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి