దండగా వారితో
దండగ వారితో దారిద్ర్య సఖ్యంబు
మానవలయునీవు మాటలేల
రాఖికట్టగనేల రక్కసి మూకకు
గార్ధబంబునకేల గంధ మలద
పందికేలవలయు పందిరి.మంచంబు
జంబుకంబునకేల జాజిపూలు
వాయసంబునకేల వాయన దానమ్ము
దున్నపోతునకేల దూది పరుపు
ఆ.వే. చనువు చూపగానె.సఖ్యంబు చూపని
జడుల తోడ మైత్రి జగడ మగును
ఆర్తి బాపువారె నాత్మీయు లగుదురు
మనసులేని వారి మైత్రి వలదు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి