మేధావులు

(మేధావులారా!మీకే అంకితము)
ఏతావు లేనట్టీ మేధావు లున్నారు
పుట్టకొకరువారు చెట్టుకొకరు
ఒకకంటిసున్నము వొడుపుగా పెట్టెడు
వైనమంతతెలియి వైద్యులోయి
మసినిపూయకలగు మాయవిద్యనేర్చి
జనులకంటనిసుక జల్లగలరు
అయినవారికెపుడయాకులాయెనకట
కానివారికకట కంచమాయె
పౌరహక్కలనుచు పొక్కుచుందురకట
సామన్యజనులకెల్ల చావులాయె
ఉగ్రమూకలకేమొ నూడిగమ్ములుసేయ
తపనపడుటలోన తత్పరతను
చూపగలరువీరు చోద్యమంద
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత