హేతువాదులు-- తీతువుపిట్టలు
హేతువాదమనుచు హేతువే లేకుండ.
(తీతువు పిట్టలా కూత వేయ)
నిర్హేతుకంబుగ.నింద సేయ
గతితర్కవాదంబు మతితప్పె గాబోలు
పడికట్టు పదముల పందిరేసి
నిర్మాతయేలేని నిర్మాణ ముండునా
తల్లియేలేనట్టి తనయు డెట్లు
ఉన్మాద బుధ్ధితో నున్నవే లేనట్లు
మసిబూయగలరయ్హిని వీరు
ఆ.వే విత్తు చెట్టు గుట్టు విప్పగలరేవీరు
విసువులేని యట్లు విపుల రీతి
ఆత్మ దృష్టి కన.న నన్యంబు లేదయ్య
భౌతికంపు దృష్టి పరిమి తంబు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి