తారక మంత్రంబు
తారకమంత్రంబు తడయక జపియించి
తాత్పర్యమెరిగిన తపసియితడు
భుజగమ్ము లెల్లను భూషణమ్ములుకాగ
భోగీశుడైనాడు భువన మందు
దాక్షిణ్య దృష్టిచే దక్షిణా మూర్తియై
పరతత్త్వ మెరిగించు పరమశివుడు
కాలకూటవిషమును కంఠంబులోదాచి
జగములకాచిన జాలిగుండె
ఆ.వే.ఆశ వసన మాయె యశనమ్ము బిక్షమ్ము
మంచుకొండ నుండు మౌన నియతి
భక్తజనుల బ్రోచు భవరోగ వైద్యండు
కరుణ జూపి మమ్ము కాయ వలయు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి