వైఖానసోక్తి

వైకుంఠ నిలయాన వైఖానసోక్తిగా
అరవింద నేత్రుని యడుగొ కనుడు
అలసిసొలెసెనేమొ నాదమరచి స్వామి
పాముపడక పైని పవ్వళించె
లోకంబు రక్షించు లోకేశ్వరుండంత
యోగనిద్రను చూచు భాగ్య మొసగె
నిత్యాన పాయని నీరజేక్షణురాని
పాలకడలిపట్టి పాదమొత్త
సనకాది మౌనింద్ర సందోహ మంతయు
నిగమోక్త విధితోడ వినితిచేయ
ఆ.వే.గగనసదృశు డతడు గాంభీర్య మూర్తిని
కాంచవలయు మనము కాంక్ష తీర
అతడు కాడె మనకు నానంద నిలయుండు
భక్త జనుల కెల్ల ముక్తి నిచ్చు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత