జగదంబ
జనయిత్రి జేజేలు జగదంబ జేజేలు
వసుధకే నీవమ్మ వరములొసగ
ఆకలినీతీర్చ నన్నపూర్ణవునీవు
కష్టాలు కడచేర్చు కన్నతల్లి
అమ్మా!యనుచు నిన్నునార్తితో పిలువగా
వేవేగ వత్తువు వేల్పు తల్లి
సద్విద్య యందించు శారదా మాతవు
వరలక్మితల్లియైవరము లొసగ
నీకన్న యెవరమ్మ నీరజాక్షునిరాణి
అమ్మవైనీవుందు వాదుకొనగ
సస్యసంపదనిచ్చు శాకంబరీమాత
అన్నిరూపములతోనాదు కొనగ
ఆ.వె.తల్లి పాలకొరకుతల్లడిల్లుశిశువు
అమ్మకొరకు వెదకు నర్భకుండు
వంటి వారిమమ్మ వసుధలో మేమంత
తల్లి చాటు వారు తనయులెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి