కినుక చూపకు

కినుకచూపెదవేల కింకరుడనేను
అన్యమొరుగనట్టి యమ్మకూచి
నిరతంబు మదిలోన నిన్నంత ధ్యానింతు
నిష్టనొసగవమ్మ నిన్ను దలతు
చంచలాత్మడనేను చలియించు మనసంత
స్థిరముగా నిల్పెడి స్థితినిమ్ము
అమ్మతో ముచ్చట్లు నానంద మందించు
శ్రీమాత చిరునవ్వ చింత దీరు
ఆ.వే.తల్లికరుణ.లేక తరియింప గలనెట్లు
అంత మెరుగ నబ్ధి వోలె
మాయ తెరను ద్రుంచు మర్మంబునందివ్వ
మాతకన్న గలరె మహని సుమ్ము


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత